NTV Telugu Site icon

Stock market: ఒక్క రోజు లాభాలకు బ్రేక్.. మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై.. ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 81, 820 దగ్గర ముగియగా.. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 20, 057 దగ్గర ముగిసింది.

సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

బజాజ్ ఆటో, టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకీ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ను దాదాపు 1 శాతం వరకు లాగడంతో ఆటో స్టాక్స్ కూడా దెబ్బతిన్నాయి. వినియోగదారుల రుణాలపై ఎక్కువగా ఆధారపడే ఆటో రంగంలో పెట్టుబడిదారులు రేట్ల తగ్గింపు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆందోళన చెందారు.

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ప్రధానంగా ఆహార ధరల పెరుగుదల కారణంగా తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆగస్టులో 3.7 శాతంగా ఉన్న వార్షిక ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.5 శాతానికి పెరిగింది.