NTV Telugu Site icon

Stock market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లో ముగిసింది. గత వారంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. మంగళవారం కాస్త ఒడిదుడుకుల నుంచి తేరుకుని లాభాల్లోకి వచ్చింది. బుధవారం ఉదయం కూడా లాభాల్లోనే సూచీలు మొదలయ్యాయి. కానీ ముగింపులో మాత్రం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 81, 647 దగ్గర ముగియగా.. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 24, 981 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Nobel Prize: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు

నిఫ్టీలో ఐటీసీ, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జీసీ, హెచ్‌యుఎల్ నష్టాల్లో కొనసాగగా.. ట్రెంట్, సిప్లా, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి. ఎఫ్‌ఎమ్‌సిజి (1.3 శాతం క్షీణత), ఆయిల్ అండ్ గ్యాస్ (0.6 శాతం క్షీణత) మినహా మిగిలిన అన్ని సూచీలు ఫార్మా, పవర్, రియల్టీ 1-2 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: Minister Narayana: మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం