దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కారణంగా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయం మొదలైంది. దీంతో అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా భారీ నష్టాల దిశగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లకు పైగా పతనం అయిపోయింది.
ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 1070 పాయింట్లు నష్టపోయి 76, 148 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 357 పాయింట్లు నష్టపోయి 23, 024 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని రంగాల సూచీలు రెడ్‌లో కొనసాగుతున్నాయి.