Site icon NTV Telugu

SBI hikes MCLR: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ.. వడ్డీ రేట్లు వడ్డించింది..!

Sbi

Sbi

SBI hikes MCLR: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు మరోసారి షాకిచ్చింది.. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.. ఎస్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారంగా మారాయి.. వెహికల్స్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, హౌసింగ్‌ లోన్స్‌తో పాటు అన్నిరకాల రుణాలపై ఈ ప్రభావం పడుతుంది.

Read Also: Rescue operation For Eagle: గద్ద కోసం 2 గంటల రెస్క్యూ ఆపరేషన్.. అసలేం జరిగింది..?

కాగా, ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు అంతకు ముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.05 శాతం చేసింది.. రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్ఆర్లను ఒక్కొ క్క టి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్బీఐ పేర్కొంది.. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్లను ఒక్కొ క్క టి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది. అయితే, కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటునే ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ -బేస్డ్ లెండింగ్ రేట్‌గా పిలుస్తారు.. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్ఆర్ ఆటోమేక్‌గా రుణాలపై ప్రభావం చూపుతోంది.

Exit mobile version