NTV Telugu Site icon

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా టాప్ రేంజ్‌లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 874 పాయింట్లు లాభపడి 79, 468 దగ్గర ముగియగా.. నిఫ్టీ 304 పాయింట్లు లాభపడి 24, 297 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.95 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

ఇది కూడా చదవండి: Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!

నిఫ్టీలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, విప్రోలు లాభపడగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, టెక్ మహీంద్రా మరియు టైటాన్ కంపెనీ నష్టపోయాయి. మెటల్, హెల్త్‌కేర్, మీడియా, పవర్, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ 2-3 శాతంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2 శాతం చొప్పున పెరిగాయి. ఆర్‌బీఐ పాలసీ ఫలితాలకు ముందు భారీ లాభాలతో ముగియడం శుభసూచికంగా నిపుణులు పరిగణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Puja khedkar: యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా