SIP vs PPF: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, సంపాదించిన దానిని పొదుపు చేయడం అంతకన్నా కష్టం అవుతుంది. నిత్యం అనేక ఆర్థిక అవసరాల మధ్య అవస్థలు పడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కూడబెట్టుకోవాలని అనుకునే వారికి ఈ స్టోరీ. ఆర్థిక భద్రత కోసం, మీరు ఎంత ఆదా చేస్తారు, అలా ఆదా చేసిన సొమ్మును ఎక్కడ పొదుపు చేస్తున్నారన్నది చాలా చాలా ముఖ్యం. చాలా మంది ప్రజలు సాధారణంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ను సురక్షితమైనదిగా భావిస్తుండగా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) ఇప్పుడు సంపద సృష్టి సాధనంగా పేరుగాంచాయని విశ్లేషకులు చెబుతున్నారు. మీరు నెలకు రూ.7,500 ఆదా చేస్తే రాబోయే 15 సంవత్సరాలలో ఏ పథకం ఎక్కువ రాబడిని ఇస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Sandalwood : షాకింగ్.. నటిని కిడ్నాప్ చేసిన నిర్మాత?
మీ వార్షిక పొదుపు రూ.90 వేలు అయితే, నెలకు రూ.7,500. నిజానికి ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి మీకు రెండు అనువైన మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి PPF ఖాతాలో ఒకేసారి ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం లేదా రూ.7,500 నెలవారీ SIP (SIP)లో పెట్టడం. వాస్తవానికి ఈ రెండూ కూడా సాధారణ పెట్టుబడికి అద్భుతమైన ఎంపికలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వాటి రాబడి రాబోయే 15 సంవత్సరాల కాలంలో గణనీయంగా మారుతుందని అంటున్నారు.
PPF లో రాబడి ఎంత?
ముందు మనం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) గురించి మాట్లాడుకుందాం. డబ్బుతో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా ఉంటుంది. మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.90 వేలు ఈ ఖాతాలో జమ చేస్తే, ప్రస్తుత వడ్డీ రేటు 7.1% మీరు పొదుపు చేసిన మొత్తానికి కలుస్తుంది. అలాగే మీ పెట్టుబడికి ప్రభుత్వం రక్షణను కూడా అందిస్తుంది. అయితే స్థిర వడ్డీ రేటు కారణంగా ఈ వృద్ధి రేటు నెమ్మదిగా ఉంటుంది. లెక్కల ప్రకారం.. 15 సంవత్సరాల తర్వాత మీ మొత్తం డిపాజిట్ (రూ. 13.5 లక్షలు) వడ్డీతో కలిపి సుమారు రూ. 24.4 లక్షల కార్పస్‌ను రిటన్ ఇస్తుంది.
SIP లో చూస్తే..
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ SIPల గురించి చర్చిద్దాం. దీంట్లో రిస్క్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రాబడికి అవకాశం కూడా అంతే బలంగా ఉంటుందని చెబుతున్నారు. మీరు అదే రూ.90 వేలు సంవత్సరానికి (అంటే నెలకు ₹7,500) SIPలో పెట్టుబడి పెడితే, మీకు వచ్చే లెక్క మారుతుంది. ఇందులో సగటున 12% వార్షిక రాబడిని ఊహించవచ్చని అంటున్నారు. అందువల్ల 15 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.7,500 డిపాజిట్ చేయడం ద్వారా, మీకు 15 సంవత్సరాల తర్వాత, మీ మొత్తం కార్పస్ సుమారు రూ. 37.8 లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు.
READ ALSO: NSC Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు..!
