Site icon NTV Telugu

Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!

Shantanu Narayen

Shantanu Narayen

Shantanu Narayen: గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘అడోబ్’ (Adobe)లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 18 ఏళ్లుగా కంపెనీని విజయపథంలో నడిపిస్తున్న భారత సంతతి సీఈఓ శంతను నారాయణ్, తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, కొత్త సీఈఓ బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని కంపెనీ స్పష్టం చేసింది. శంతను నారాయణ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, సంస్థ బోర్డు ఛైర్మన్‌గా మాత్రం కొనసాగనున్నారు. కొత్త వారసుడిని ఎంపిక చేసేందుకు అడోబ్ బోర్డు ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సంస్థ లోపల ఉన్న ప్రతిభావంతులతో పాటు, బయటి అభ్యర్థులను కూడా ఈ కమిటీ పరిశీలిస్తోంది.

READ ALSO: Monalisa: “మోనాలిసా 35 ముక్కలుగా దొరుకుతుంది”.. సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు..

శంతను హయాంలో సాధించిన ప్రగతి ఇదే..
తన 18 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అడోబ్‌ను శంతను ఏ స్థాయికి తీసుకెళ్లారో తెలుసా.. ఆయన కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు 3,000 మందిగా ఉన్న ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుతం 30,000కు పైగా పెరిగింది. ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్న కంపెనీ ఆదాయం, నేడు 25 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఫోటోషాప్ నుంచి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వరకు అడోబ్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువయ్యాయి. సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ.. శంతను నారాయణ్ సేవలను కొనియాడారు. ముఖ్యంగా ప్రస్తుత AI యుగంలో అడోబ్ సాధిస్తున్న విజయాలకు ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని ప్రశంసించారు. బాధ్యతల మార్పు ప్రక్రియ సాఫీగా సాగేలా తాను బోర్డుతో కలిసి పనిచేస్తానని శంతను ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శంతను నారాయణ్, అంతర్జాతీయ స్థాయిలో ఒక దిగ్గజ టెక్ సంస్థను ఇన్నాళ్ల పాటు నడిపించడం భారతీయులందరికీ గర్వకారణం.

READ ALSO: Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..

Exit mobile version