Site icon NTV Telugu

Seven Metal Companies into TATA Steel: ఒకే సంస్థ(టాటా స్టీల్‌)లోకి ఏడు కంపెనీల విలీనం.

Seven Metal Companies Into Tata Steel

Seven Metal Companies Into Tata Steel

Seven Metal Companies into TATA Steel: టాటా గ్రూప్‌కి చెందిన ఏడు మెటల్‌ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనమయ్యాయి. ఈ విలీనానికి టాటా స్టీల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సమర్పించిన వివరాల ప్రకారం.. టాటా స్టీల్‌లో విలీనమైన ఆ మెటల్‌ కంపెనీల పేర్లు.. టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ది టిన్‌ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, టాటా మెటాలిక్స్‌ లిమిటెడ్‌, TRF లిమిటెడ్‌, ది ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ మైనింగ్‌ లిమిటెడ్‌, ఎస్‌ అండ్‌ టీ మైనింగ్‌ కంపెనీ లిమిటెడ్‌.

ఇండియాపై ఇండోనేషియా ఫోకస్‌

మన దేశ పామాయిల్‌ మార్కెట్లలో కనీసం 60 శాతం వాటానైనా సాధించేందుకు ఇండోనేషియా ప్రయత్నిస్తుందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఇండోనేషియా ఈ వాటాను ఇటీవలి కాలంలో సుమారు 47 శాతానికి చేజార్చుకుందని పేర్కొన్నాయి. ఆ దేశం కోల్పోయిన షేర్‌ని మలేషియా ఆక్రమించినట్లు వెల్లడించాయి. గ్లోబల్‌ మార్కెట్లలో టన్ను పామాయిల్‌ ధర దాదాపు వెయ్యి నుంచి 11 వందల డాలర్ల మధ్య స్థిరంగా కొనసాగుతోంది. ఇండియా ఏటా 13 మిలియన్‌ టన్నులకు పైగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 63 శాతం పామాయిలే కావటం గమనించాల్సిన విషయం.

ఏడాదిలో 200 శాతం గ్రోత్‌

జెట్‌వర్క్‌ అనే డిజిటల్‌ మ్యానిఫ్యాక్షరింగ్‌ సంస్థ ఏడాది వ్యవధిలోనే ఆరింతల గ్రోత్‌ సాధించింది. 5 వేల 718 కోట్ల రూపాయల గ్రాస్‌ మర్చెండైజ్‌ వ్యాల్యూని నమోదుచేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 835 కోట్లు మాత్రమే ఉన్న ఈ సంస్థ ఆపరేటింగ్‌ రెవెన్యూ ఇప్పుడు ఏకంగా 4 వేల 961 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి గ్రూప్‌ లెవల్‌లో 11 వేల 200 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు పొందింది. ఇది గతేడాదితో పోల్చితే 200 శాతం పెరుగుదల కావటం విశేషం. ఈ సంస్థ రెవెన్యూలో 70 శాతం ఇండస్ట్రియల్‌ సెగ్మెంట్‌ నుంచి 30 శాతం కన్జ్యూమర్‌ సెగ్మెంట్‌ నుంచి వస్తోంది. మొత్తం బిజినెస్‌లో 16 శాతం ఇంటర్నేషనల్‌ రెవెన్యూ కాగా మిగతాది డొమెస్టిక్‌ మార్కెట్‌ది కావటం గమనార్హం.

Exit mobile version