దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతేకాకుండా సెన్సెక్స్ 1,500 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారిగా 83 వేల మార్కు దాటింది. అలాగే నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిని తాకి 25, 400 మార్కును క్రాస్ చేసింది. మొత్తానికి పెట్టుబడిదారుల పంట పడింది. సెన్సెక్స్ 1,439 పాయింట్లు లాభపడి 82, 962 దగ్గర ముగియగా.. నిఫ్టీ 470 పాయింట్లు లాభపడి 25, 388 దగ్గర ముగిసింది. ఆటో, మెటల్, ఎనర్జీ మెజారిటీ స్టాక్‌లు లాభాల్లో దూసుకెళ్లగా.. అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Seethakka: మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం..
భారత బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సెషన్ ముగింపులో 1.5 శాతం పెరిగి వరుసగా 83,116 మరియు 25,433 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో టాప్ గెయినర్లుగా కొనసాగాయి. నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. నిఫ్టీ 50లో కేవలం రెండు స్టాక్‌లు మాత్రమే మధ్యాహ్నం 2:08 గంటలకు తగ్గుముఖం పట్టగా.. మిగిలిన 48 షేర్లు భారీగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘సిగ్గు చేటు’’.. ఆర్మీ అధికాలపై దాడి, గర్ల్‌ఫ్రెండ్‌పై గ్యాంగ్ రేప్‌పై రాహుల్ ఫైర్..