NTV Telugu Site icon

Stock Market: నాలుగోరోజూ స్టాక్ మార్కెట్లకు తప్పని నష్టాలు

Stock Market

Stock Market

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలున్నప్పటికీ ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాల్లోనే ముగిసాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వేగవంతమైన రేటు పెంపుదల ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టివేస్తుందనే ఆందోళనతో చాలా ఆసియా స్టాక్‌లు కూడా తక్కువగా ట్రేడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తప్పదన్న ఐఎంఎఫ్ అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి. రూపాయి బలహీనత, అమెరికాలో ద్రవ్యోల్బణం గరిష్ఠానికి చేరడం కూడా మదుపర్ల ఆశలను ఆవిరిచేశాయి. చమురు ధరలు 100 డాలర్ల దిగువనే ట్రేడవ్వడం ఒక్కటే మార్కెట్లకు సానుకూలాంశం కాగా.. ఆర్థికమాంద్యం నేపథ్యంలోనే చమురుకు గిరాకీ తగ్గనుందన్న వార్త కలవరపరిచింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రికార్డు గరిష్ఠమయిన రూ.79.88 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. యూరోపియన్ మార్కెట్లలో బలహీన ధోరణుల మధ్య ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ షేర్లు నష్టపోయాయి.

Maharashtra: ‘మహా’ గుడ్‌న్యూస్.. పెట్రోల్ లీటర్‌కు రూ.5, డీజిల్‌ రూ.3 తగ్గింపు

తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి సెన్సెక్స్‌ 98 పాయింట్లు నష్టాలకు పరిమితమై 53416 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 15938 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బలహీనంగా ముగిశాయి. అయితే, నిఫ్టీ ఫార్మా 0.78 శాతం, నిఫ్టీ ఆటో 0.13 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్‌ సూచీలో సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, బజాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.