దేశీయ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో దూసుకెళ్తోంది. ఈ వారం లాభాల్లోనే సూచీలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కారణంగా శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం కొనుగోళ్ల అండతో తిరిగి పుంజుకుని గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 81, 086 దగ్గర ముగియగా.. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24, 823 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ రూ.83.95 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసింది.
ఇది కూడా చదవండి: Cylinder Blast: స్కూల్‌లో పేలిన సిలిండర్.. విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
నిఫ్టీలో బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో కొనసాగగా.. విప్రో, ఓఎన్‌జీసీ, దివిస్ ల్యాబ్స్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. సెక్టార్లలో ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగ్గా.. మెటల్, రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ 0.5-2.5 శాతం చొప్పున క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: కోల్‌కతా ఘటన నిందితుడికి 14 రోజుల కస్టడీ..