Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీలు తమ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులు, ప్రమోటర్ల వాటాల వివరాలను ఎప్పటికప్పుడు సెబీకి నివేదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కంపెనీ యజమానులు (ప్రమోటర్లు) తమ వద్ద ఉన్న షేర్లను ఎక్కడైనా కుదువ పెట్టినప్పుడు, ఆ సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా బహిర్గతం చేయాలి. ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ నిబంధనలలో చిన్నపాటి జాప్యం జరిగినా, సెబీ దానిని తీవ్రంగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తుంది. తాజాగా మణప్పురం ఫైనాన్స్ అధినేత విషయంలో జరిగినది కూడా ఇటువంటి నిబంధనల ఉల్లంఘనే.
మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వి.పి. నందకుమార్‌కు భారత సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) పరిపాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. షేర్ల కుదువకు సంబంధించిన వివరాలను ఆలస్యంగా వెల్లడించినందుకు గాను ఈ చర్య తీసుకుంది.
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
2018 సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య జరిగిన కొన్ని లావాదేవీలకు సంబంధించి, నందకుమార్ తన షేర్లను కుదువ పెట్టారు. నిబంధనల ప్రకారం.. ఈ వివరాలను తక్షణమే స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాలి. కానీ.. ఆయన ఆ సమాచారాన్ని అక్టోబర్ 11, 2018న సమర్పించారు. అంటే, గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఈ సమాచారం ఫైల్ చేయబడింది.
సెబీ నిబంధనల ఉల్లంఘన…
సెబీ నిబంధనలు ప్రకారం.. ప్రమోటర్లు తమ షేర్లపై ఎటువంటి భారాన్ని సృష్టించినా.. విడుదల చేసినా నిర్ణీత గడువులోగా వెల్లడించాలి. ఈ గడువును పాటించకపోవడాన్ని సెబీ తప్పుపట్టింది.
ఈ హెచ్చరిక కేవలం నందకుమార్‌కు ఆయన వ్యక్తిగత హోదాలో మాత్రమే జారీ చేయబడింది. దీనివల్ల కంపెనీపై ఎటువంటి ఆర్థిక జరిమానా విధించలేదు. ఈ హెచ్చరిక వల్ల మణప్పురం ఫైనాన్స్ ఆర్థిక స్థితిపై గానీ, రోజువారీ వ్యాపార కార్యకలాపాలపై గానీ ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇటువంటి హెచ్చరికలు సాధారణంగా భవిష్యత్తులో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించడానికి ఇస్తారు. కంపెనీ సెక్రటరీ అపర్ణ మీనన్ ఈ వివరాలను అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించారు. నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా వ్యవహరిస్తామని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!