NTV Telugu Site icon

SEBI: వీడియోకాన్ కేసులో ధూత్‌‌కు షాక్.. రూ.కోటి నోటీసు

Venugopaldhoot

Venugopaldhoot

వీడియోకాన్ కేసులో పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్‌‌కు సెబీ షాకిచ్చింది. రూ.కోటి చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ధూత్‌తో పాటు మరో ఇద్దరికి సెబీ రూ.1 కోటి నోటీసులు జారీ చేసింది. వేణుగోపాల్ ధూత్ మరియు మరో రెండు సంస్థలకు సెబీ రూ.1.03 కోట్ల విలువైన డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించకుంటే అరెస్టు చేసి ఆస్తులను అటాచ్ చేస్తామని నోటీసుల్లో హెచ్చరించింది. 2021లో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ధూత్ మరియు సంస్థలు విఫలమైన తర్వాత ఈ నోటీసు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: LPG cylinder: వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే..!

ఎలక్ట్రోపార్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు కూడా సెబీ నోటీసులు పంపింది. సెప్టెంబరు 2021లో సెబీ విధించిన జరిమానాలను చెల్లించడంలో ధూత్‌తో పాటు ఈ సంస్థలు విఫలమయ్యాయి. ఈ సంస్థలు మార్చి 1, 2017 నుంచి మే 9, 2017 వరకు వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లలో ప్రచురించబడని ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను కలిగి ఉండగా ట్రేడ్ చేసినట్లు సెబీ దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చదవండి: KCR : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు