Site icon NTV Telugu

Mutual Fund New Rules: మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త రూల్స్‌.. సెబీ కీలక ప్రకటన విడుదల!

Sebi

Sebi

Mutual Fund New Rules: మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలిపేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పెంచుతున్నట్లు సెబీ (SEBI) ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఇటీవల మ్యూచువల్‌ ఫండ్‌లో పారదర్శకతను పెంచడం, పెట్టుబడిదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా సెబీ పలు కొత్త ప్రతిపాదనలను రెడీ చేసింది. ముఖ్యంగా, టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (TER)కు మరింత స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్‌ నుంచి వసూలు చేసే సేవా చార్జీలను గణనీయంగా తగ్గించేలా సెబీ మార్పులు చేసింది.

Read Also: Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..

అయితే, అక్టోబర్‌ 28వ తేదీన ఈ ప్రతిపాదనలు విడుదల చేసిన సెబీ.. ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. ఇదెలా ఉండగా, అందిన వినతులు, ప్రతిపాదనలపై వచ్చిన స్పందనలను పరిగణనలోకి తీసుకుని, అభిప్రాయాల సమర్పణ గడువును నవంబర్‌ 24 వరకు పొడిగిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇక, సెబీ తాజా నిర్ణయంతో పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పూర్తిగా సమర్పించుకునేందుకు అవకాశం కల్పించింది.

Exit mobile version