NTV Telugu Site icon

SBI : రూ. 5 వేలతో, రూ.50 లక్షలు లాభం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు..

Funds

Funds

రూ. 5 వేలతో రాబడి రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం కాసుల వర్షం కురిపించింది.. ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందించింది.. ఇందులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అదిరే రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఏయూఎం రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ ఫండ్ మార్కెట్‌లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పాత కాలం నాటి ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. 2009 సెప్టెంబర్ 9న ఈ ఫండ్‌ను ఆవిష్కరించారు..

ఈ ఫండ్స్ లో డబ్బులను పెట్టడంతో ఐదు రంగాల్లో 55 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఫండ్ హౌస్ ప్రకారం చూస్తే.. ఈ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే సీఏజీఆర్ 20.54 శాతంగా ఉంది. అంటే ఫండ్ ఎన్ఎఫ్‌వో రోజున రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసని వారు ఇప్పుడు రూ. 1.37 కోట్ల లాభాలను పొందుతున్నారు. ఈ స్కీమ్ బెంచ్‌మార్క్ ఎస్అండ్‌పీ బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్.. 11.72 శాతం సీఏజీఆర్ చొప్పున పెరిగింది…

ఇకపోతే ఈ ఫండ్ స్కీమ్‌ లో మొదటి నుంచి సిప్ చేస్తూ వచ్చి ఉంటే ఎలాంటి బెనిఫిట్ లభించేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ సీఏజీఆర్ 22.85 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ ఎఎరైనా ఈ స్కీమ్‌ లో ప్రతి నెలా రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే.. ఇప్పుడు వారి ఇన్వెస్ట్ మెంట్ విలువ దాదాపు రూ. 49.44 లక్షలకు చేరి ఉండేది.. ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.8.4 లక్షలు.. ఈ ఫండ్స్ ను చూసినట్లుయితే.. క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, కన్సూమర్ సర్వీసెస్, ఫైనాషియల్ సర్వీసెస్, కన్‌స్ట్రక్చన్ రంగాల్లోని షేర్లలో ఇన్వెస్ట్ చేశారు. స్కీమ్ పోర్ట్‌ ఫోలియోలో 58 శాతం వాటా ఈ ఐదు రంగాలదే ఉంది.. ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఏంటనీ చూస్తే.. డైవర్సిఫైడ్ స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతలాభాలను సొంతం చేసుకోవచ్చు..

Show comments