Site icon NTV Telugu

State Bank Of India: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

State Bank Of India

State Bank Of India

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఎస్‌బీఐ పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హోం, పర్సనల్, కారు లోన్‌లపై చెల్లించే ఈఎంఐలు పెరిగాయి. ఎంసీఎల్‌ఆర్‌ను మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌ అని చెప్పొచ్చు. ఎంసీఎల్ఆర్ ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఏదైనా లోన్‌ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో అందుబాటులోకి తెచ్చింది.

Read Also: MonkeyPox: మంకీపాక్స్ పై కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ

ఎస్‌బీఐ తాజా ప్రకటన ప్రకారం.. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్‌ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. ఆరు నెలల టెన్యూర్‌ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి. ఏడాది టెన్యూర్‌ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్‌ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. మూడేళ్ల టెన్యూర్‌ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి. మ‌రోవైపు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ కూడా జులైలో ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నిర్ధిష్ట కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. జూలై 12 నుంచి ఈ రేట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. అటు ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ కూడా వివిధ కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10-15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ రేట్లు జూలై 8 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Exit mobile version