ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి షాక్ ఇచ్చింది.. కీలక వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది.. వడ్డీ రేట్లను పెంచడం మూడు నెలల్లో ఇది మూడోసారి.. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్)ని ఈ రోజు 20 బేసిస్ పాయింట్లు పెంచింది, ద్రవ్య విధాన కమిటీ బెంచ్ మార్క్ పాలసీ రేట్లను పెంచిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. ఎస్బీఐ ఓవర్‌నైట్, నెల, మూడు నెలల గడువు గల టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.35 శాతం అయితే, ఆరు నెలల టెన్యూర్ లోన్లపై 7.65 శాతం, ఏడాది టెన్యూర్ రుణాలపై 7.70 శాతం, రెండేళ్ల గడువు గల లోన్లపై 7.90 శాతం, మూడేండ్ల టెన్యూర్ లోన్లపై 8 శాతం ఎంసీఎల్ఆర్ అమలవుతుంది. ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపోరేట్ పెంచిన విషయం తెలిసిందే.. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచింది.. ఇక, ఆర్బీఐ పెంపునకు అనుగుణంగా ఎస్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచివేసింది.
Read Also: Ex-serviceman collapses during flag hoisting: జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ కుప్పకూలిన మాజీ జవాన్
ఎంసీఎల్ఆర్‌తో పాటు ఈబీఎల్ఆర్ (ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్), రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) కూడా పెంచేసింది ఎస్బీఐ.. దీంతో.. హోం లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, వెహికల్ లోన్స్ అన్ని పెరిగిపోనున్నాయి.. ఇప్పటికే ఆయా రుణాలు తీసుకున్న వ్యక్తులపై ఈఎంఐ భారం పెరగనుంది. కాగా, ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే తమ ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచేశాయి.. ఇక, ఇప్పుడు ఎస్బీఐ కూడా వడ్డించింది. మొత్తంగా అన్ని రకాల రుణాలపై వడ్డీలు పెరిగి.. ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.
