NTV Telugu Site icon

అల‌ర్ట్: ఎస్బీఐ ఖాతాదారుల‌కు మాత్ర‌మే

sbi

దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాకింగ్ సంస్థ‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క‌స్ట‌మ‌ర్లు అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింది… ఎందుకంటే.. ఎస్బీఐ డిజిట‌ల్ సేవ‌లు నిలిచిపోనున్నాయి.. అందుకే ముందే త‌న ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేస్తోంది ఎస్బీఐ… ఆదివారం ఏకంగా 14 గంట‌ల పాటు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవ‌లు అందుబాటులో ఉండ‌బోవ‌ని ప్ర‌క‌టించింది.. అయితే, ఆర్టీ‌జీఎస్ సేవ‌లు మాత్రం యథావిథిగా కొన‌సాగుతాయ‌ని తెలిసింది.. దీని కార‌ణం.. మే 22న బ్యాంకింగ్ బిజినెస్ అవ‌ర్స్ ముగిసిన వెంట‌నే.. సిస్ట‌మ్స్ సాంకేతికంగా అప్‌గ్రేడేష‌న్ చేస్తున్నామ‌ని.. దీంతో.. శ‌నివారం అర్థ‌రాత్రి 12:01 గంట‌ల నుంచి ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఎస్బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవ‌లు పొందే వీలు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.