Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
Salary Delay: సాధారణంగా ఉద్యోగులు ప్రతి నెలా 1వ తేదీ రాగానే తమ జీతం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి మే 1వ తేదీన జీతాలు అందడం కష్టమని తెలుస్తోంది. మే నెల స్టార్టింగ్‌లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేసి ఉండటమే జీతాల ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నిజానికి మే 1వ తేదీన ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (మే డే), ‘బుద్ధ పౌర్ణమి’ ఒకే రోజు వచ్చాయి. ఈ రెండు సందర్భాల వల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు పని చేయకపోవడం వల్ల జీతాల ప్రాసెసింగ్, నిధుల బదిలీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడనుంది.
జీతం ఎప్పుడు రావచ్చు..
మే 1న జీతం రావాల్సిన వారికి మరుసటి రోజు అంటే మే 2వ తేదీన లేదా ఆ తర్వాత డబ్బు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బంది కలగకూడదని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏప్రిల్ నెలాఖరులోనే (ముందుగానే) జీతాలు విడుదల చేస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఇచ్చే కంపెనీల్లో మాత్రం 1 లేదా 2 రోజులు ఆలస్యం కావచ్చు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్ వంటివి 24 గంటలు పనిచేసినప్పటికీ, కంపెనీల బల్క్ శాలరీ ప్రాసెసింగ్ బ్యాంకుల పనిదినాలపైనే ఆధారపడి ఉంటుంది.
Also Read
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
మే నెలలో 13 రోజులు సెలవులు..
మే నెలలో ఆదివారాలు, శనివారాలు, పండుగలతో కలిపి మొత్తం 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఉద్యోగులు ఎవరు కూడా మే 1న జీతం రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం బ్యాంకు సెలవుల వల్ల కలిగే తాత్కాలిక ఆలస్యం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈఎంఐ లాంటివి ఉన్నవాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!