Site icon NTV Telugu

War Effect: స్టీల్ ఉత్ప‌త్తికి భారీ దెబ్బ‌…

ప్ర‌పంచంలో అత్య‌ధిక స్టీల్ ను ఉత్పత్తి చేసే దేశాల మ‌ధ్య వార్ జ‌రుగుతుండ‌టంతో ప్ర‌పంచ దేశాల్లో స్టీల్ కొర‌త ఏర్పడే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌పంచంలో ఎక్కువ‌శాతం స్టీల్‌ను ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాలు ఉత్ప‌త్తి చేస్తుంటాయి. అక్క‌డి నుంచి వివిధ దేశాల‌కు ఎగుమ‌తి అవుతుంది. అయితే, ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ కార‌ణంగా రెండు దేశాల నుంచి స్టీల్ ఉత్ప‌త్తి, ఎగుమ‌తులు ఆగిపోయే ప‌రిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్ర‌పంచంలో స్టీల్ సంక్షోభం ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Read: Ukraine Crisis: దాడుల నుంచి త‌ప్పించుకుంటూ 30 కిమీ న‌డిచిన విద్యార్ధులు…

ర‌ష్యా- ఉక్రెయిన్ నుంచి 40 మిలియ‌న్ ట‌న్నుల స్టీల్ విదేశాల‌కు ఎగుమ‌తి అవుతుంది. ఈ ఎగుమ‌తులు ఆగిపోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టీల్ ఆధారిత వ‌స్తువుల ధ‌ర‌లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు స్టీల్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన ముడిప‌దార్ధాల‌కు డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే యుద్ధం కార‌ణంగా ముడిచ‌ములు, గ్యాస్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఇప్పుడు స్టీల్ ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Exit mobile version