Site icon NTV Telugu

Rupee Strengthened: పడి పడి లేచె రూపాయి. ఒక్క రోజులో అత్యధిక విలువ పెరుగుదల

Rupee Strengthened

Rupee Strengthened

Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్‌ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి. చెప్పుకోదగ్గ విషయం కూడా. రూపాయి విలువతోపాటు బాండ్ ధరలు కూడా పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆ ప్రభావం ఈ రెండింటిపై పడకపోవటం గమనార్హం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి, కార్పొరేట్ల నుంచి డాలర్‌ ఇన్‌ఫ్లో పెరగటం కూడా రూపాయి విలువ బలపడటానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మర్‌ తెలిపారు.

డెయిరీ మార్కెట్‌.. డబుల్‌ ధమాకా..

మన దేశంలో డెయిరీ మార్కెట్‌ రానున్న ఐదేళ్లలో 2 రెట్లకు పైగా వృద్ధి సాధించనుంది. తద్వారా 2027 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరనుంది. ఈ విషయాన్ని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ చైర్మన్‌ మీనేష్‌ షా వెల్లడించారు. మార్కెట్‌ సైజ్‌ పరంగానే కాకుండా వ్యాల్యూ పరంగా కూడా గ్రోత్‌ ఉంటుందని అంచనా వేశారు. విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 8 కోట్ల మంది పాడి పరిశ్రమ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

also read: Cent Percent Work From Home: అక్కడ మళ్లీ వంద శాతం వర్క్‌ ఫ్రం హోం?

రష్యా చూపు.. మన టూరిస్టుల వైపు..

ఇండియన్‌ టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను సమర్థంగా తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలోని రెండు టాప్‌ సిటీలైన మాస్కో మరియు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ తమ ప్రతినిధులను ముంబైలో జరుగుతున్న ఓటీఎం ట్రేడ్‌ ఈవెంట్‌కి పంపింది. ఇదొక అతిపెద్ద ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ కావటంతో ఇక్కడకి భారీగా వచ్చే ట్రావెల్‌ ఏజెంట్లకు తమ టూర్‌ ప్యాకేజ్‌ల గురించి వివరించొచ్చని ఆ దేశం భావించినట్లు చెప్పొచ్చు.

Exit mobile version