పండగ వేళ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. సేల్ పెంచుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కళ్లు చెదిరే తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్ ను అందించి కస్టమర్లను టెంప్ట్ చేస్తోంది. ఓలా ఈవీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేల్స్ లో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తోంది. పండగను మరింత క్యాష్ చేసుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది.
అయితే ఈ ఆఫర్ జనవరి 12 నుంచి 14 వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నది. అంటే రెండు రోజులు మాత్రమే ఆఫర్ ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఓలా S1 కేవలం రూ. 59,999 ధరతో ప్రారంభమవుతుంది. ప్రతి S1 పై ఉచిత ఎక్స్‌టెండెడ్ బ్యాటరీతో S1 శ్రేణిపై రూ. 24 వేల వరకు తగ్గింపు అందిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్న వారు ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి. S1 మోడల్ S1 Z, S1 Z+ రెండు వేరియంట్లో అందుబాటులో ఉంది. ఆకర్షనీయమైన డిజైన్ తో కస్టమర్లను కట్టిపడేస్తుంది. ఓలా S1 Z ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లు 1.5kWh స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.
అయితే ఓలా ఎలక్ట్రిక్ అదనపు బ్యాటరీ ప్యాక్ ను అందింస్తోంది. ఇది 75 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తోంది. అంటే అప్పుడు S1 Z ఈవీ 146 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పోర్టబుల్ బ్యాటరీ సాయంతో ఏ టెన్షన్ లేకుండా మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. S1 Z సింగిల్ పీస్ సీట్ తో వస్తుంది. దీనిపై ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయొచ్చు. S1 Z+ సింగిల్ సీట్ తో వస్తుంది. దీనితో పాటు రియర్ లగేజీ క్యారియర్ అందించారు.
ఫోన్ మౌంట్, ఫ్రంట్ లగేజీ క్యారియర్ తో వస్తుంది. ఇది కమర్షియల్ గా యూజ్ ఫుల్ గా ఉంటుంది. S1 Z ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది. S1 Z+ ప్రారంభ ధర రూ. 64,999గా ఉంది. మరి బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లున్న ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకునే వారు ఓలా ఎలక్ట్రిక్ అందించే ఈ ఆఫర్ ను వదులుకోకండి. రెండు వేరియంట్ల బుకింగ్ ప్రారంభ ధర రూ.499 రూపాయలుగా ఉంది. బుక్ చేసుకున్న వారికి 2025 మే నెలలో డెలివరీలు ప్రారంభిస్తమని కంపెని వెల్లడించింది.