NTV Telugu Site icon

Google: మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే, లేకపోతే.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

Google

Google

Google: కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి. గతంలో ఉద్యోగులు చెప్పినట్లు సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోంకు తలొగ్గాయి. అయితే ఇప్పుడు ఆర్థికమాంద్యం పరిస్థితుల కారణంగా ఐటీ జాబులు ఎప్పుడు పోతాయో తెలియదు. దీంతో కంపెనీలు కూడా ఉద్యోగులకు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందే అని ఆదేశిస్తున్నాయి.

Read Also: Mahesh Babu: అస్సలు.. మహేష్ అన్నా.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుందా.. ?

ఇదిలా ఉంటే ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ కూడా తన ఉద్యోగుల కీలక సందేశాన్ని పంపింది. వారంలో కనీసం 3 రోజలు ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే అని ఆదేశించింది. ఎవరైనా ఈ నిబంధన పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ఉద్యోగుల పనితీరు సమీక్షల్లో తక్కవ గ్రేడింగ్ ఉంటుందని తెలిపింది. తాజాగా గూగుల్ తన వర్క్ పాలసీని అప్డేట్ చేసింది. ఆఫీస్ బ్యాడ్జ్‌ల ద్వారా హాజరును ట్రాక్ చేయడంతో పాటు పనితీరు సమీక్షల సమయంలో వారికి తదనుగుణంగా రేటింగ్ చేస్తామని కంపెనీ తెలిపింది.

హాజరు కావడంలో ఉద్యోగులు విఫలం అయితే తీవ్రంగా పరిగణిస్తామని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫియోనా సిక్కోని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న గూగుల్ ఉద్యోగులు ఆఫీసులకు దగ్గరగా ఉంటే హైబ్రీడ్ మోడ్ లో పనిచేయాలని కోరారు. ఇటీవల దేశీయ ఐటీ కపెంనీ అయిన ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది. పలు ఐటీ కంపెనీలు కూడా తమ వ్యాపారాలకు అనుగుణంగా ఉద్యోగులు ఆఫీసుకలు రావాల్సిందే అని చెబుతున్నాయి.