యూపీఐ డిజిటల్ పైప్‌లైన్‌ను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), యూపీఐలోని TPAPల వాల్యూమ్ క్యాప్‌ను 30శాతానికి పరిమితం చేయడానికి గడువును 2024 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో, దాదాపు 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్లేయర్‌లకు ఇది ఉపశమనం కలిగిస్తోంది.. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఒక్క థర్డ్ పార్టీ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్‌లో ఎన్పీసీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందిఏ.. అయితే, ఈ నిర్ణయం వాస్తవానికి 2022 జనవరి 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నా.. 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్‌లు అయినటువంటి గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది.
Read Also: TSPSC : వార్డు ఆఫీసర్లను నియమించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ
అయితే, గడువు ఇచ్చిన సమయం కూడా ముగిసిపోయింది.. కానీ, యూపీఐ ప్రస్తుత వినియోగం, భవిష్య త్తు అవకాశాల దృష్ట్యా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. 30 శాతానికి పైగా లావాదేవీలు నిర్వహిస్తున్న యాప్ సంస్థలకు నిబంధనల అమలుకు ఇచ్చిన రెండేళ్ల అదనపు గడువును, 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఎన్పీసీఐ పేర్కొంది.. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులకు ఉన్న భారీ అవకాశాల దృష్ట్యా బ్యాంకులు, నాన్ బ్యాంకులు సైతం ఈ విభాగంలో మరింత వృద్ధి నమోదు చేస్తాయని అభిప్రాయపడింది.. కాగా, డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పే వాటా సుమారు 46 శాతం, గూగుల్‌పే వాటా 33 శాతంగా, పేటీఎం వాటా 11 శాతంగా ఉంది.. ఇక, ఈ సంవత్సరం ప్రారంభంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెల్లింపు వ్యవస్థల్లో ఛార్జీలపై ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది, ఇది తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలకు అనుగుణంగా యూపీఐ లావాదేవీలపై టైర్డ్ ఛార్జీని విధించేలా చేసింది. యూపీఐ అనేది ఆర్థిక వ్యవస్థకు అపారమైన సౌలభ్యం మరియు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గూడ్ అని మరియు యూపీఐ సేవలకు ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.