NTV Telugu Site icon

Reliance Sports Drink Spinner: మార్కెట్లోకి రిలయన్స్ స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్’.. కేవలం రూ. 10కే

Spinner

Spinner

ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముందుగానే మొదలైపోయింది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండే ఎండల్లో కూల్ కూల్ గా జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మార్కెట్ లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తుండగా.. ఇప్పుడు వాటికి మరో డ్రింక్ యాడ్ అయ్యింది. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన కొత్త స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్’ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి స్పిన్నర్ కొత్త బ్రాండ్ ను ఆవిష్కరించింది. స్పోర్ట్స్ డ్రింక్ ‘స్పిన్నర్ ధర కేవలం రూ. 10 కే అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్‌ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేయడానికి, ప్రధాన ఐపిఎల్ జట్లు – లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ లతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని స్పిన్నర్‌ను మూడు విభిన్న రుచుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. లెమన్, ఆరెంజ్, నైట్రో బ్లూ ఫ్లేవర్లలో లభించనున్నది.

ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. ఒక అథ్లెట్‌గా నాకు హైడ్రేషన్ విలువ తెలుసన్నారు. ఆడుతున్నప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు ఎనర్జీ కోల్పోతుంటారని అలాంటి సమయాల్లో స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్ యూజ్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. అథ్లెట్ల కోసం మాత్రమే కాదు.. హైడ్రేట్ గా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ డ్రింక్ బెస్ట్ అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తెలిపింది.