NTV Telugu Site icon

Jio 5G: మరో 9 తెలుగు నగరాల్లో జియో 5జీ..ఉచిత డేటా ఆఫర్!

Jio

Jio

దేశవ్యాప్తంగా 5జీ సేవల్ని విస్తరించడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతోంది. విడతల వారిగా 5జీ సర్వీసుల్ని కొత్త నగరాల్లో లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో 34 సిటీల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చిందని సంస్థ తెలిపింది. ఇందులో తొమ్మిది తెలుగు నగరాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు, తెలంగాణలోని మూడు నగరాలు ఇకపై 5జీ సర్వీసుల్ని పొందనున్నాయి. ఆంధ్ర నుంచి అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల, తెనాలిలో ఇకపై ఈ సేవలు లభించనున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలో 5జీ సేవలు ఇకపై లభ్యమవుతాయి. వీటితో పాటు అస్సాం 3, చత్తీస్‌ఘడ్ 2, హర్యానా 2, మహారాష్ట్ర 2, ఒడిశా 2, పంజాబ్ 2, తమిళనాడు 8 సిటీలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్తాన్‌లోని ఒక్కో నగరం 5జీ సేవల్ని పొందబోతోంది. ఈ ప్రాంతాల్లోని కస్టమర్లు వెల్‌కమ్ ఆఫర్ కింద ఎలాంటి అదనపు రీఛార్జ్ లేకుండా 1జీబీపీఎస్ ప్లస్ 5జీ డేటాను ఉచితంగా పొందవచ్చు. మొత్తం 13 రాష్ట్రాల్లోని మరో 34 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను మంగళవారం ప్రారంభించింది రిలయన్స్ జియో. దీంతో జియో ట్రూ 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా 225 నగరాలకు విస్తరించాయి.

Minister Jogi Ramesh: సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..

Show comments