NTV Telugu Site icon

Reliance Jio Offer: జియోలో మరో కొత్త ప్రీఫెయిడ్ ప్లాన్స్..మ్యూజిక్ తోపాటు మరికొన్ని..

Reliance Offer

Reliance Offer

రిలయన్స్ జియో కంపెనీ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మరో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను పెంచుకుంటూ వస్తుంది.. ఈ మేరకు JioSave Pro subscriptionతో జియో ఉచిత ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల తో డేటా, కాలింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ JioSaveకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్ వల్ల ఎటువంటి బ్రేక్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్ పొందొచ్చు.. ఒకసారి ఆ ప్లాన్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం జియో అందించిన కొత్త ప్లాన్స్ లో అత్యంత చీప్ ప్లాన్ రూ.269 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్లో 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 1.5GB డేటా ను పొందుతారు. ఈ ప్లాన్ భారతదేశంలోని అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు…అదే విధంగా రోజుకు వంద మెసేజ్ లు కూడా పొందవచ్చు..

దీని తర్వాత మరో ప్లాన్ రూ.529 ప్లాన్ తీసుకున్న వారికి 56 రోజుల వాలిడిటీ తో ప్రతిరోజూ 1.5 జిబి డేటా లభించనుంది. అంతేకాదు యాడ్ ఫ్రీ మ్యూజిక్, అన్ లిమిటెడ్ జియో ట్యూన్ అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి… కాల్స్, మెసేజ్ లు, డేటాను కూడా పొందవచ్చు..

రూ.589 ప్లాన్ తీసుకున్న వారికి రోజుకు 2జిబి డేటా, 100 మెసెజెస్, అన్ని నెట్వర్క్స్‌కు అపరిమితంగా కాల్స్, ఉచిత JioSaavn ప్రో సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5G డేటా, JioSuite యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు మాత్రమే..

ఈ ప్లాన్స్ తీసుకున్న వారికి 84 రోజుల వాలిడిటీ లభించనుంది. ఈ ప్లాన్లో మిగిలిన ప్రయోజనాలు పైన పేర్కొన్న ప్లాన్ల మాదిరిగానే ఉంటాయి. రూ.589 ప్లాన్‌తో 56 రోజుల వాలిడిటీ ఇవ్వబడుతుంది.

అలాగే చివరి ప్లాన్ రూ.789 ప్లాన్ తీసుకున్న వారికి 84 రోజుల వాలిడిటీతో, రోజుకు 2జిబి డేటా లభించనుంది. వీటితో పాటు యాడ్ ఫ్రీ మ్యూజిక్, జియో ట్యూన్ బెనిఫిట్స్ కలగనున్నాయి. అంతేకాదు.. అన్ లిమిటెడ్ కాల్స్, మెసేజ్ లను కూడా పొందవచ్చు.. అదే విధంగా 15 భాషలలో ప్లాన్స్ ఉన్నాయి.. మీరు పొందాలని అనుకుంటే ముందుగా భాషను ఎంపిక చేసుకోవాలి..

Show comments