నేటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్లో అడుగు పెడుతోంది. అయితే.. వినియోగదారుల చూపు ఆకర్షంచేందుకు రిలయన్స్ జియో ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇటీవల గత అక్టోబర్ నెలలో జియో ఫోన్ నెక్ట్స్ మొబైల్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జియో నెక్ట్స్ ధర రూ. 6,499లు ప్రకటించింది. దీంతో సేల్స్ పెంచేందుకు మరో ముందుడుగు వేస్తూ.. బంపర్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 6,499 కాగా, ఏదైనా 4జీ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 2 వేల తగ్గింపుతో జియో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. దేశంలోని అందరికీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో జియో తీసుకొచ్చిన ఈ ఫోన్ 4జీకి సపోర్ట్ చేస్తుంది.
5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్‌లో మెమరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎం ప్రాసెసర్, 13 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ ‘ప్రగతి ఓఎస్’పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను తొలుత రూ. 1,999 చెల్లించి వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18/24 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్‌కు కూడా ఇన్‌స్టాల్‌మెంట్ వర్తిస్తుందని జియో పేర్కొంది.
