NTV Telugu Site icon

Jio Financial: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్

Jio

Jio

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్ సొల్యూషన్స్ 28 అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వచ్చే ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్‌ పొందింది. ఈ ఆమోదం జియో చెల్లింపులను సులభతరం చేయడానికి మరియు నిర్వహించడానికి అనుమతిస్తుంది. వ్యాపారులు, వినియోగదారుల కోసం డిజిటల్ లావాదేవీలు ఉండనున్నాయి. ఇది పేటీఎం అందించే సేవ వలే ఉంటుంది.

ఇది కూడా చదవండి: Triglycerides: గుండెకు ముప్పు కలిగించే ట్రై గ్లిజరైడ్ అంటే ఏమిటి..?

మరోవైపు ధన్‌తేరస్‌ సందర్భంగా జియో ఫైనాన్షియల్ సంస్థ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. జియో ఫైనాన్షియల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసేందుకు ‘స్మార్ట్‌ గోల్డ్‌’ సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ యాప్‌ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేయొచ్చని తెలిపింది. రూ.10 నుంచి పెట్టుబడి పెట్టొచ్చని పేర్కొంది. కావాలంటే డిజిటల్‌ గోల్డ్‌ను క్యాష్ రూపంలో గానీ, ఫిజికల్‌ గోల్డ్‌గానూ పొందొచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: BC Census: బీసీ గణన చేయాలని సీఎం చంద్రబాబుకు వినతి..

Show comments