Site icon NTV Telugu

Jio IPO: 2026లో ఐపీఓకు జియో.. ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే..

Jio Ipo

Jio Ipo

Jio IPO: రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, MD ముఖేష్ అంబానీ కీలక విషయాలను తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జియో IPO ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కంపెనీ దానికి సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టిందని, 2026 మధ్య నాటికి కచ్చితంగా జియో IPO ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐపీఓకు సంబంధించిన పత్రాలను త్వరలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి సమర్పించనున్నట్లు తెలిపారు. జియో IPO కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతోందని చెప్పడానికి తాను గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ఇది చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు.

READ ALSO: “సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందన”

కంపెనీ నయా రికార్డ్..
రిలయన్స్ జియో నేడు మరో మైలురాయిని సాధించిందని, కంపెనీ కస్టమర్ల సంఖ్య 50 కోట్లను దాటిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వాటాదారులు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జియోను ప్రజల జీవితాలను మార్చేసిందన్నారు. జియో కొన్ని ఊహించలేని పనులు చేసింది. వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందజేయడం, డిజిటల్ చెల్లింపుల మార్గాన్ని మార్చడం, ఆధార్, యూపీఐ, జన్ ధన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రాణం పోయడం, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా పనిచేయడం వంటి విజయాలను నమోదు చేసిందన్నారు.

త్వరలో అంతర్జాతీయ కార్యకలాపాలు..
రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. దేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, జియో 5G కస్టమర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగిందని అన్నారు. జియో త్వరలో అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అన్నారు. ప్రస్తుతం 22 కోట్లకు పైగా వినియోగదారులు జియో ట్రూ 5G నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యారని తెలిపారు. జియో ట్రూ 5G డిజిటల్ కనెక్టివిటీ వేగం, విశ్వసనీయత, పరిధిని పునర్నిర్వచించిందని అన్నారు. ప్రతి భారతీయుడు జియోను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని దానిని నిర్మించారని ఆయన చెప్పారు.

READ ALSO: Gidugu Venkata Ramamurthy: దేశ భాషలందు తెలుగు లెస్స.. నేడు తెలుగు భాషా దినోత్సవం..

Exit mobile version