NTV Telugu Site icon

Zomato: జీతం లేదు.. పైగా 20లక్షల ఫీజు.. వింతైన జాబ్‌కు ఎంతమంది దరఖాస్తు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Zomato

Zomato

ఏదైనా కంపెనీలో ఉద్యోగం అంటే ఐదంకెల జీతం.. వగేరా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆయా కంపెనీల్లో ఖాళీలు ఉంటే వాంటెడ్ పోస్టులు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఇదేంటో గానీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం వింతైన జాబ్ ఆఫర్ చేసింది. ఈ ప్రకటన చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. అసలు ఆ జాబ్ ఏంటి? ఎంత మంది అప్లై చేశారో తెలిస్తే.. మరింత షాక్ అవ్వాల్సిందే.

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ బుధవారం వింతైన జాబ్ ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ స్టాప్ పోస్టు కోసం అప్లై చేసుకోవాలంటూ కొన్ని షరతులు పెట్టారు. ఒక సంవత్సరం పాటు జీతం ఉండదని.. పైగా రూ.20 లక్షల ఫీజు చెల్లించాలని ప్రకటన చేశారు. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురుగ్రామ్‌లోని జొమాటో ప్రధాన కార్యాలయంలలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ ఉద్యోగానికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదని.. అయితే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అయితే ఈ జాబ్ ఆఫర్‌ చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు. ఇదేం జాబ్ అంటూ కామెంట్లు చేశారు.

అయితే తాజాగా గురువారం దీపిందర్ గోయల్ మరొకసారి స్పందించారు. బుధవారం ప్రకటించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఒక్కరోజులోనే 10 వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారుల్లో డబ్బు ఉన్నవారు ఉన్నారని.. డబ్బు లేని వారు మాత్రం ఇద్దరు ఉన్నారని వెల్లడించారు. మొత్తానికి ఆయా రకాలైన నిరుద్యోగులు ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు.

Show comments