RBI circular: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో మార్పు చోటుచేసుకుంది. ఈ పథకంలో భాగంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బంగారాన్ని మెచ్యూరిటీ గడువు కన్నా ముందే తీసుకోవాలంటే డబ్బులు మాత్రమే చెల్లిస్తారు. గోల్డ్ ఇవ్వరు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మెచ్యూరిటీ డేట్ ముగిశాకైతే డబ్బు గానీ బంగారం గానీ తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే.
రష్యా బొగ్గు
జులై నెలలో మన దేశానికి అత్యధికంగా బొగ్గును సరఫరా చేసిన దేశాల జాబితాలో రష్యా మూడో స్థానానికి చేరింది. ఈ దిగుమతులు దాదాపు ఐదు రెట్లకు పైగా పెరగటం విశేషం. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఇండియాకి ఎగుమతి చేసిన బొగ్గు విలువ 15 బిలియన్ డాలర్లు దాటింది. ఈ వివరాలను కోల్‌మింట్ అనే ఇండియన్ కన్సల్టెన్సీ వెల్లడించింది.
Varalakshmi Vratham Pooja Vidhanam Live: వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరించాలి..
కొత్త ‘రాయల్’
ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్-350 ఎట్టకేలకు మన దేశంలో ఈరోజు లాంఛ్ కానుంది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన టీజర్లు బుల్లెట్ ప్రేమికులకు తెగ నచ్చేశాయి. కొత్త మోడల్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా కొనేద్దామా అని రెడీగా ఉన్నారు. ఇంతగా ఆసక్తిని రేకెత్తించిన ఆ లేటెస్ట్ మోడల్ అందరి అంచనాలనూ నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.
బ్రిటన్‌లో క్లోజ్
మన దేశంలోని 3వ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ బ్రిటన్‌లోని అనుబంధ సంస్థను మూసేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీకి సమాచారం ఇచ్చింది. ఓపెన్ పేడ్ అనే ఆర్థిక సంస్థతో ఒప్పందం విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకుంది. యూకేలో తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పబోతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తొలిసారిగా 2020వ సంవత్సరంలోనే తెలిపింది.
విమానాల రద్దు
నాన్సీ పెలోసి పర్యటనకు నిరసనగా చైనా తమ దేశానికి దగ్గరలో క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో తైవాన్ నిన్న గురువారం విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ఎగుమతులపై ఏ మేరకు ప్రభావం చూపిందనేది తెలియరాలేదు. తైవాన్ నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రాసెసర్ చిప్‌లు, ఇతర సరుకులు నిత్యం పెద్ద సంఖ్యలో ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. విమానాల రద్దుతో అవి భారీగానే నిలిచిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
కూరగాయలు కాస్ట్‌లీ
దేశంలోని అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లలో ఒకటైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో రేట్లు మండిపోతున్నాయి. టమాటా, ఉల్లిగడ్డలు మినహా మిగతా కూరగాయల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వర్షాల కారణంగా కొద్ది వారాలుగా సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడుతుండటంతో రేట్లు భగ్గమంటున్నాయి.