ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆర్బీఐ సెలవులను ప్రకటించింది.
ఈ జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. పలు పండగలు, ఈవెంట్స్ ఉండడంతో సెలవులు భారీగానే ఉన్నాయి. 4 జాతీయ సెలవులతో పాటు.. 11 ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి నెల రెండవ, నాలుగవ శనివారాలల్లో కూడా సెలవులు ఉండనున్నాయి. ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. బ్యాంకు పనులు ఉన్నవారు ఈ సెలవుల గురించి ముందే తెలుసుకుని ఉంటే మీ సమసయం వృదా కాకుండా ఉంటుంది.
తెలంగాణలో జాతీయ సెలవుల లిస్ట్:
- జనవరి 26: గణతంత్ర దినోత్సవం
- ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
- అక్టోబర్ 2: గాంధీ జయంతి
- డిసెంబర్ 25: క్రిస్మస్
తెలంగాణలో ప్రాంతీయ సెలవుల లిస్ట్:
- ఫిబ్రవరి 26: మహా శివరాత్రి
- మార్చి 29: ఉగాది
- ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
- ఏప్రిల్ 6: రామ్ నవమి
- ఏప్రిల్ 10: మహావీర్ జయంతి
- మే 1: మే డే
- జూన్ 7: బక్రీద్ / ఈద్ అల్-అదా
- జూలై 21: బోనాలు
- సెప్టెంబర్ 22: బతుకమ్మ మొదటి రోజు
- అక్టోబర్ 21: దీపావళి
- నవంబర్ 5: కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి