Best Post Office Savings Plans: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనే మాట గుర్తు ఉంది కదా.. అలాగే డబ్బును సంపాదిస్తే.. డబ్బే తిరిగి డబ్బును సంపాదిస్తుందనేది మాటను కూడా గుర్తుకు ఉంచుకోండి. ఈ రోజుల్లో డబ్బును సంపాదించడం సులువు కానీ.. సంపాదించిన డబ్బును సరిగ్గా పొదుపు చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఒక వైపు చూస్తే 2025 లో అనేక బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఆ వైపుగా పొదుపు చేయాలని అనుకుంటున్న వారికి తక్కువగా వడ్డీ వస్తుంది. వాస్తవానికి ఎఫ్‌డీలకు మించి లాభాలు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ పథకాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Jio Recharge Plan: జియో అద్భుతమైన 84 రోజుల ప్లాన్.. తక్కువ ధరకే మతిపోగొట్టే బెనిఫిట్స్..
పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు..
పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకాలు అనేక పెద్ద బ్యాంకు FDల కంటే మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో ఈ పథకాలపై వడ్డీ రేట్లను కూడా సవరిస్తుంది. అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు 7% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
* 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకం: ఈ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. 2 సంవత్సరాల కాలానికి రూ.10 వేల పెట్టుబడి 7% రేటుతో సుమారు రూ.719 దిగుబడిని ఇస్తుంది. వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి పెరుగుతుంది.
* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ : సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తుంది. ఈ పథకం 8.2% వడ్డీ రేటును ఇస్తుంది. రూ.10,000 కు రూ.205 చొప్పున త్రైమాసికానికి నేరుగా డిపాజిట్ పొందుతారు. ఇది ఒక ఆదర్శవంతమైన పదవీ విరమణ పథకంగా విశ్లేషకులు చెబుతున్నారు.
* నెలవారీ ఆదాయ ఖాతా : ఈ పథకం కింద పోస్టాఫీసు సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. అంటే రూ.10 వేల పెట్టుబడితో నెలకు రూ.62 ఆదాయం లభిస్తుంది.
* జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC) : ఈ పథకం వార్షిక వడ్డీ రేటు 7.7% అందిస్తుంది. రూ.10 వేలు, ఐదు సంవత్సరాల తర్వాత ₹14,490 గా మారుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీస్ పథకాలలో ఒకటి. ఈ పథకం సంవత్సరానికి 7.1% కాంపౌండ్ వడ్డీ రేటును అందిస్తుంది. ఇది పన్ను రహిత దీర్ఘకాలిక పొదుపు ఎంపిక. ఇది 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది, ఇందులో ఎప్పుడైనా ఉపసంహరణలు చేసుకునే వెసులుబాటు ఉంది.
* కిసాన్ వికాస్ పత్ర (KVP) : ఈ పోస్టాఫీసు పథకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇది 7.5% వడ్డీ రేటును అందిస్తుంది.
* మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ : ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం అందుబాటులో ఉంది. ఇది త్రైమాసిక వడ్డీ రేటును 7.5% ఇస్తుంది. ఈ పథకం కింద రూ.10,000 రెండు సంవత్సరాల తర్వాత రూ. 11,602 కు పెరుగుతుంది. ఇది మహిళల కోసం ఒక ప్రత్యేక పథకంగా చెబుతున్నారు.
* సుకన్య సమృద్ధి ఖాతా: ఈ పథకం సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఖాతా ఆడపిల్ల పేరు మీద ఓపెన్ చేస్తారు. ఆ చిన్నారికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇందులో జమ చేసిన డబ్బులు ఇస్తారు. ఇది పన్ను రహితమైనది, అలాగే అత్యధిక రాబడిని అందిస్తుంది.
