Post Office FD Scheme: పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి కోసం, కూతురు పెళ్లి కోసం డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా.. ఎవరైనా సరే వారి డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు అధిక రాబడి వచ్చే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే మీకు పోస్టాఫీసు పెట్టుబడి పథకాలు సురక్షితమైన ఎంపిక. పోస్టాఫీసుకి సంబంధించిన ఓ గొప్ప పథకం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒకేసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.15 లక్షలు అంటే రూ.10 లక్షల ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.. మీకు 10 లక్షలు లాభం వస్తుంది. ఈ పథకంలో మీరు పొదుపు చేస్తే.. అది ఎలా రూ.10 లక్షల లాభాన్ని తీసుకువస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Donald Trump: భారత్‌తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’.. భారత్‌పై ట్రంప్ అక్కసు..
ఏంటీ ఈ పథకం..
ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అని పిలుస్తారు. దీనిని సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని కూడా అంటారు. ఈ పథకంలో ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. ఆ డిపాజిట్‌పై ప్రతి ఏడాది వడ్డీ వస్తుంది. ఇక్కడే మీకు సంతోషాన్ని ఇచ్చే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది ప్రభుత్వ పథకం. దీంతో ఇందులో పెట్టుబడి పెడితే డబ్బు పోతుందనే భయం ఏమాత్రం ఉండదు. మీకు తెలుసా పోస్ట్ ఆఫీస్ చాలా బ్యాంకులు అందించే వడ్డీ కంటే ఎక్కువ ఇస్తుందని.. పోస్ట్ ఆఫీస్‌లో 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.5% వార్షిక వడ్డీ వస్తుంది.
ప్రయోజనాలు చూడండి..
పోస్టాఫీస్ FDలో ఒక్కసారి మాత్రమే రూ.5 లక్షలు డిపాజిట్ చేసి 15 ఏళ్లు ఈ డబ్బుని తాకకుండా ఉంచాలి. ఈ స్కీమ్‌లో నెలనెలా ఎటువంటి వాయిదా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎటువంటి మార్కెట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయినప్పటికీ 15 ఏళ్ల తర్వాత పెట్టుబడి పెట్టిన వాళ్లకు రూ.15 లక్షలకు పైగా రాబడి లభిస్తోంది. అంటే మీరు రూ.10 లక్షల ప్రత్యక్ష లాభం పొందుతారు.
రూ.5 లక్షలతో రూ.15 లక్షలు..
డబ్బు పొదుపు చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు ఒకేసారి రూ.5 లక్షలు పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి 5 ఏళ్ల పాటు వాటిని తీయకుండా ఉంచాలి. అప్పుడు దీనిపై ఏడాదికి 7.5% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి దాదాపు రూ.7,24,974కి పెరుగుతుంది. అయితే ఈ పథకంలో పెట్టిన డబ్బులను వెంటనే తీసుకోకుండా.. మరో 5 ఏళ్ల పాటు అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టండి. అప్పుడు ఈ మొత్తం రూ.10,51,175కి పెరుగుతుంది. మరికొంచెం ఓపికతో దానిని మళ్లీ మూడోసారి 5 ఏళ్ల పాటు డిపాజిట్ చేయండి. ఇప్పుడు మొత్తం దాదాపు రూ.15,24,149కి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి బాస్.. మీరు ప్రారంభంలో పెట్టిన మొత్తం రూ.5 లక్షల పెట్టుబడి ఇప్పుడు 15 ఏళ్లలో మూడు రెట్లు ఎక్కువ అవుతుంది. అంటే మీకు రూ.10 లాభం వచ్చినట్లు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదని గుర్తుంచుకోండి.
READ ALSO: Modi Slams Pakistan: ప్రధాని మోడీ మాటలతో తలపట్టుకున్న పాక్ ప్రధాని
