PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?

  • PM Kisan డబ్బులు రేపే
  • రూ.2,000 విడతపై రైతులకు కీలక అప్‌డేట్
Pm Kisan 24th Installment

Pm Kisan 24th Installment

PM Kisan 24th Installment 2026: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు కీలక అప్‌డేట్. 2026 అక్టోబర్ 30న గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లోకి తదుపరి విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా నిధులు అందించనున్నారు.

ఈసారి PM-KISAN విడతలో ఏం ప్రత్యేకం?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ పథకం కింద 23 విడతలు విడుదలయ్యాయి. ప్రధాని మోడీ ప్రత్యేక సందర్భాలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి విడతలను విడుదల చేస్తారు. ఈసారి, 24వ విడతను గుజరాత్ నుంచి విడుదల చేయనున్నారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నుంచి నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 30న 24వ విడతను విడుదల చేయనున్నట్లు అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో, ఒక్కోసారి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జరుగుతాయి.