Site icon NTV Telugu

Petrol Price: పెట్రోవాత తప్పదు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలే అడ్డం..!

మార్చి 1 నాటికి భారత్‌ కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్‌ సంస్థలు ఒక్కో లీటరుపై 5.7 నష్టాన్ని భరిస్తున్నాయి. మునుపటి తరహాలో సాధారణ మార్జిన్లను కంపెనీలు పొందాలంటే ఒక్కో లీటర్‌పై… దాదాపు పది రూపాయలు పెంచాల్సి వస్తుంది. సామాన్యులపై భారాన్ని దించేందుకు ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే సూచనలున్నాయి. మార్చి 7న యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ సైతం ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. దీంతో మార్కెటింగ్‌ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ సవరణను ప్రారంభించే అవకాశం ఉందని అంచనా వేసింది.

Read Also: IND vs SL: కోహ్లీ, రోహిత్‌ శర్మ అరుదైన పీట్‌..!

దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానమై ఉంటాయి. గత 118 రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ధరల సవరణను నిలిపివేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 95.41, డీజిల్‌ ధర 86.67గా ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో వందకు పైగానే ఉన్న విషయం తెలిసిందే.. మొత్తంగా.. ఎన్నికల తర్వాత పెట్రో వాత తప్పదనే విశ్లేషణలు వెలువడుతుండడంతో.. మరోసారి సామాన్యుడిని పెట్రోబాంబ్‌ భయపెడుతోంది.

Exit mobile version