Site icon NTV Telugu

LIC Jeevan Tarun Policy: LIC సూపర్ ప్లాన్ చూశారా! కేవలం రూ.150 ఆదా చేస్తే రూ.26 లక్షలు..

Lic Jeevan Tarun Policy

Lic Jeevan Tarun Policy

LIC Jeevan Tarun Policy: ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులకు ఉండే ప్రధాన దిగులు వారి పిల్లలకు నాణ్యమైన విద్య, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వేగంగా పెరుగుతున్న విద్య వ్యయాన్ని భరించడానికి కేవలం స్వల్ప పొదుపుతో సాధ్యం కాదని చాలా మంది తల్లిదండ్రుల ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి ఆర్థిక పరిమితులు అనేవి చాలా మంది పిల్లల కలలను నెరవేరకుండా చేస్తాయి. మీ పిల్లలు వారి కలలను నెరవేర్చుకోడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసే ఒక పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీసుకొచ్చింది. ఇంతకీ పాలసీ ఏంటి, దాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

READ ALSO: Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీసుకొచ్చిన కొత్త పాలసీ జీవన్ తరుణ్ పాలసీ. ఇది మీ పిల్లల కలలను నిజం చేయడంలో విశేషంగా సహాయం చేస్తుంది. ఇది మీ పిల్లల కలలకు రెక్కలు ఇవ్వడమే కాకుండా సురక్షితమైన, భద్రమైన భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

‘జీవన్ తరుణ్’ పథకం అంటే..
LIC యొక్క జీవన్ తరుణ్ పాలసీ పిల్లల మారుతున్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఇది లింక్ చేయని, పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ. దీని అర్థం మీరు స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు దాచుకునే ప్రతీపైసా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం మీ పిల్లల విద్య, కళాశాల ఫీజులు లేదా వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పాలసీలో ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. వారి పిల్లలకు ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత ఈ పాలసీ ద్వారా వారు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతారని విశ్లేషకులు చెబుతున్నారు.

రూ.150 పొదుపు రూ.26 లక్షలు ఎలా అవుతుందో తెలుసుకుందాం..
ఈ పథకం కింద మీరు రోజుకు రూ.150 ఆదా చేయడానికి కట్టుబడి ఉండాలి. వాస్తవానికి ఏ మధ్యతరగతి కుటుంబానికి కూడా ఈ మొత్తం పెద్దది కాదు. రోజుకు రూ.150 చొప్పున, మీరు నెలకు రూ.4,500 పెట్టుబడి పెడతారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ మొత్తం పొదుపు రూ.54,000 వరకు పెరుగుతుంది. మీ పిల్లలకు ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ పాలసీని ప్రారంభించి, 25 సంవత్సరాలు కొనసాగిస్తే, పాలసీ మెచ్యూరిటీ టైంకి మీరు రూ.26 లక్షల వరకు పొందవచ్చు. ఈ మొత్తంలో మీ అసలు మొత్తం, వార్షిక బోనస్‌లు, చివరి అదనపు బోనస్ కూడా ఉంటాయి.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే పాలసీ తీసుకోవడానికి పిల్లల కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయస్సు 12 సంవత్సరాలు ఉండాలి. మీ బిడ్డకు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే, వారు ఈ పథకంలో భాగం కాలేరు. ప్రీమియం చెల్లింపు వ్యవధికి రావడానికి పిల్లల ప్రస్తుత వయస్సు నుంచి 25 సంవత్సరాలు తీసివేసి, పిల్లల వయస్సు ఆధారంగా పాలసీ వ్యవధి నిర్ణయిస్తారు. ఈ పాలసీలో అతి పెద్ద హైలైట్ ఏంటంటే దాని మనీ-బ్యాక్ ఫీచర్. సాధారణంగా పాలసీలు చివరిలో డబ్బు చెల్లిస్తాయి, జీవన్ తరుణ్ పిల్లలకి 20 ఏళ్లు నిండినప్పుడు నుంచి 24 ఏళ్ల వయస్సు వరకు ప్రతి సంవత్సరం ఒక స్థిర మొత్తాన్ని తిరిగి ఇస్తుంది. పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు వారి ఫీజులను చెల్లించాల్లించడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఆ టైంలో ఇది మంచి హెల్ప్‌పుల్‌గా ఉంటుంది. చివరగా 25వ సంవత్సరంలో మిగిలిన మొత్తం బోనస్‌లతో పాటు తిరిగి ఇస్తారు. అలాగే ఈ పాలసీ పన్నులను ఆదా చేయడానికి కూడా సహాయపడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మీరు చెల్లించిన ప్రీమియంలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కిందికి వస్తుంది. ఇంకా ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మెచ్యూరిటీ మొత్తం లేదా మరణ ప్రయోజనం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10D) కిందికి వస్తుంది. ఇంకా అవసరమైతే ఈ పాలసీపై రుణం కూడా అందుబాటులో ఉంటుంది.

READ ALSO: High Return Shares : వారంలోనే కాసుల వర్షం.. 91% వరకు లాభాలను అందించిన 5 Top Stocks..!

Exit mobile version