NTV Telugu Site icon

Paytm Net Loss: పేటీఎంకి పెరిగిన నష్టం. షుగర్‌ మిల్లులకు ‘తీపి’ కబురు

Paytm Net Loss

Paytm Net Loss

Paytm Net Loss: జూన్‌ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో పేటీఎం నికర నష్టం మరింత పెరిగింది. గతేడాది 380 కోట్ల రూపాయలు నష్టం రాగా అది ఈసారి 644 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయం 89 శాతం పెరిగి 16 వందల 80 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్‌ నాటికి వచ్చిన రెవెన్యూ 891 కోట్లు మాత్రమేనని సంస్థ వెల్లడించింది. డిజిటల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసుల రంగంలో పేరొందిన పేటీఎంకి ఆదాయం పెరిగినా నష్టాలు తగ్గలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది.

‘తీపి’ కబురు

పంచదార ఎగుమతులపై పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అదనంగా 12 లక్షల టన్నులను ఎక్స్‌పోర్ట్‌ చేసేందుకు అనుమతించింది. షుగర్‌ మిల్లులు ఈ మార్కెటింగ్‌ సంవత్సరంలో ఇప్పటికే దాదాపు కోటి టన్నుల పంచదారను విదేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేశాయి. ఇది ఆల్‌ టైం రికార్డ్‌ కావటం చెప్పుకోదగ్గ విషయం. మార్కెటింగ్‌ ఇయర్‌ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుందనే సంగతి తెలిసిందే.

Laurus Labs Founder And CEO Dr. Satyanarayana Chava Exclusive Interview

‘నీతి ఆయోగ్‌’ భేటీ

రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. వ్యవసాయం మరియు సంబంధిత అంశాలతోపాటు ఇతరత్రా అజెండా పైనా చర్చ జరగనుంది. విదేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఏమేం చర్యలు చేపట్టాలో ఈ మీటింగ్‌లో చర్చిస్తారు.

ఎఫ్‌పీఐల కమిటీ

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. ఫారన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఇండియాలోకి విదేశాల నుంచి నిధుల ప్రవాహాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 14 మంది సభ్యులు ఉండే ఈ అడ్వైజరీ కమిటీకి మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ సారథ్యం వహిస్తారు. విదేశీ బ్యాంకులతోపాటు స్థానిక స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల డిపాజిటరీలు మరియు ఆర్బీఐ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఆర్బీఐ ఓకే

స్టాండలోన్‌ ప్రైమరీ డీలర్లు అన్ని విదేశీ మారక వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది. ఫారన్‌ ప్రైమరీ డీలర్‌షిప్‌ల నుంచి వినతులు వెల్లువెత్తడంతో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న లైసెన్సు పరిధి పరిమితంగా ఉండటాన్ని వాళ్లు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పూర్తి స్థాయి అనుమతులను మంజూరుచేసింది.

డీఎల్‌ఎఫ్‌ డీల్‌

దేశంలోని అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ అయిన డీఎల్‌ఎఫ్‌ సంస్థ.. సౌత్‌ ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఆంబియెన్స్‌ అనే ప్రముఖ షాపింగ్‌ మాల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీనికోసం వేలం జరిగితే బిడ్‌ వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ షాపింగ్‌ మాల్‌ ప్రారంభ వేలం ధరే 366 మిలియన్‌ డాలర్లు కావటం విశేషం.

Show comments