Paytm – Groq Partnership: డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎం విప్లవాత్మక మార్పుల దిశగా ముందడుగు వేసింది. తాజాగా ఈ డిజిటల్ చెల్లింపుల కంపెనీ తన సేవలను మరింత వేగవంతం చేయడానికి అమెరికన్ AI కంపెనీ గ్రోక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులకు డిజిటల్ అనుభవాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని, ఇది గతంలో కంటే మరింత సజావుగా, సమర్థంగా ఉంటుందని కంపెనీ భావిస్తుంది.
READ ALSO: Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్‌పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
గ్రోక్‌తో – పేటీఎం భాగస్వామ్యం..
గ్రోక్‌తో – పేటీఎం భాగస్వామ్యంలో పేటీఎం గ్రోక్ “గ్రోక్‌క్లౌడ్” సేవను ఉపయోగించుకుంటుంది. దీని శక్తి లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ (LPU) అనే ప్రత్యేకమైన సాంకేతికతలో ఉంది. ఇది మెరుపు వేగంతో కృత్రిమ మేధస్సు (AI)ని శక్తివంతం చేయడానికి మాత్రమే తయారు చేసింది. సాంప్రదాయ GPU ఆధారిత వ్యవస్థలతో పోలిస్తే, గ్రోక్ సాంకేతికత చాలా తక్కువ ఖర్చుతో వేగవంతమైన పనితీరును అందించడానికి హామీ ఇస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ Paytm స్కేల్ చేయడానికి, దాని AI-ఆధారిత కార్యకలాపాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.
ఈ సందర్భంగా పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. “చెల్లింపులను వేగంగా, మరింత విశ్వసనీయంగా చేయడానికి మేము మా AI సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుస్తున్నాము” అని పేర్కొన్నారు. గ్రోక్‌తో ఈ సహకారం రియల్-టైమ్ AI అనుభూతిని (అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం) అందిస్తుందని వివరించారు. భారతదేశంలో అత్యంత అధునాతన AI-ఆధారిత చెల్లింపులు, ఆర్థిక సేవల వేదికను నిర్మించే దిశగా ఇదొక కీలక ముందడుగు అని చెప్పారు.
గ్రోక్ సాంకేతిక బలాలు..
“జాతీయంగా రియల్-టైమ్ AI ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో Paytmకు మద్దతు ఇవ్వడంపై Groq సిద్ధంగా ఉంది” అని గ్రోక్‌లోని APAC జనరల్ మేనేజర్ స్కాట్ ఆల్బిన్ వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద సమస్యలను పరిష్కరించడానికి AIని ఉపయోగకరంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని ఆల్చిన్ స్పష్టం చేశారు. Groq కంపెనీ 2016లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికన్ AI కంపెనీలలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సేవలు అందిస్తోంది. Paytm ఇప్పటికే రిస్క్ మోడలింగ్, మోసాల నివారణ, కస్టమర్ ఆన్‌బోర్డింగ్ వంటి రంగాలలో AIని ఉపయోగిస్తోంది. తాజాగా Groq మద్దతుతో పేటీఎం కంపెనీ తన సేవలను మరింత వేగవంతం చేస్తుందని, డేటా ఆధారిత ఆర్థిక సేవల అభివృద్ధికి బలమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Amazon Layoff Story: బహుశా జీవితం అంటే ఇదేనేమో ! లేఆఫ్‌కు బలైన ఉద్యోగి కన్నీటి కథ..
