Paytm Rewards Scheme: సహజంగా పండుగల సమయంలో కంపెనీలు వినియోగదారులను టార్గెట్ చేస్తుంటాయి. కొత్తకొత్త ఆఫర్లు తీసుకొస్తూ వారిని ఆకర్షించడానికి అనేక స్కీమ్స్‌ను ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగానే డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా ఒక సూపర్ ఆఫర్ ప్రకటించింది. మీకు తెలుసా ఆ స్కీమ్ ఏంటో. మీకు ఇప్పటి వరకు ఏమైనా గోల్డ్ కాయిన్స్ వచ్చాయా.. ఏంటి ఈ గోల్డ్ కాయిన్స్ అనుకుంటున్నారా.. ఈ స్కీమ్‌కు ఈ కాయిన్స్‌కు సంబంధం ఉంది.. ఈ కొత్త ఆఫర్ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Amit Shah: మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదు.. కావాలంటే లొంగిపోండి..
పేటీఎం నయా ఆఫర్..
పండుగ పూజ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం గోల్డ్ రివార్డ్స్ స్కీమ్ పేరుతో సూపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. పేటీఎం నుంచి డిజిటల్ పేమెంట్స్, కార్డు పేమెంట్స్ మొదలైన ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా వారికి గోల్డ్ కాయిన్ రివార్డ్స్ పొందేలా ఓ కొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం ద్వారా చేసే ప్రతీ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై డిజిటల్ గోల్డ్ కాయిన్స్ రివార్డ్స్ వస్తున్నాయి. వీటిని తర్వాత బంగారంపై పెట్టుబడిగా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.
మనకు ఇప్పటి వరకు రివార్డ్స్ అనేవి ఎవరైనా సరే క్యాష్‌బ్యాక్ లేదా కూపన్స్ రూపంలో ఇచ్చారు. కానీ వాటికి భిన్నంగా పేటీఎం గోల్డ్ కాయిన్ రివార్డ్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి 100 గోల్డ్ కాయిన్స్‌కు రూ.ఒక రూపాయి విలువైన 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్‌ను సొంతం చేసుకునేలా ఈ స్కీమ్‌ను ఆవిష్కరించారు. పేటీఎం యూజర్లు యాప్ వాడి ఏ పేమెంట్ చేసినా అన్నింటిపై ట్రాన్సాక్షన్ విలువలో ఒక శాతం బంగారు నాణెంగా మారుతుంది. ఇలా 100 బంగారు నాణేల్ని సంపాదిస్తే.. అది ఒక రూపాయికి విలువైన 24 క్యారెట్ ప్యూర్ పేటీఎం డిజిటల్ గోల్డ్‌కు సమానం అవుతుంది. అయితే ఇది చాలా తక్కువ మొత్తమే అయినా.. మీరు పొందే క్యాష్ బ్యాక్ మీకు నేరుగా కాకుండా పెట్టుబడిగా మారుతుంది. ఇదే ఈ స్కీమ్ లో ఉన్న స్పెషల్.
READ ALSO: Kitchen Safety Tips: కిచెన్‌లో తెలిసీ తెలియక ఇవి చేస్తే.. ఫుడ్ పాయిజన్ అవుతుందంటా!
