Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే

  • పాస్‌పోర్ట్ కొత్త నిబంధనలు
  • పిల్లల Validity, ఫీజుల్లో కీలక మార్పులు
Passport New Rules 2026

Passport New Rules 2026

Passport Fees Hiked in India: విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులను ప్రకటించింది. 2026లో వెలువడిన కొత్త నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీల పాస్‌పోర్ట్ దరఖాస్తులకు ఫీజులు సవరించారు. అధికారిక e-Gazetteలో కూడా Passports (Amendment) Rules, 2026 నోటిఫికేషన్ నమోదైంది. ఇక పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, సాధారణ (Normal), తత్కాల్ (Tatkaal) పాస్‌పోర్ట్ ఫీజులు వంటి అంశాల్లో మార్పులు దరఖాస్తుదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది.

15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధన

15 సంవత్సరాల లోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు ప్రత్యేక చెల్లుబాటు నిబంధన ఉంటుంది. పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాలు లేదా పిల్లలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుంది.

పాస్‌పోర్ట్ ఫీజులు ఎంత?

పాస్‌పోర్ట్ కేటగిరీ పాత ఫీజు కొత్త ఫీజు
36 పేజీలు – Normal రూ.1,500 రూ.2,500
60 పేజీలు – Normal రూ.2,000 రూ.3,500
36 పేజీలు – Tatkaal రూ.3,500 రూ.5,000
60 పేజీలు – Tatkaal రూ.4,000 రూ.6,000
60 పేజీల పాస్‌పోర్ట్ Tatkaal Replacement రూ.5,500 రూ.8,500
Minor 36 పేజీలు – Normal Fresh/Reissue రూ.1,000 రూ.1,750
Minor 36 పేజీలు – Tatkaal – రూ.3,000

చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లకు 10% రాయితీ

8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కొత్తగా (Fresh) పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రాథమిక పాస్‌పోర్ట్ ఫీజుపై 10 శాతం రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ రాయితీ Reissue/Renewal దరఖాస్తులకు వర్తించదని Passport Seva మార్గదర్శకాల్లో పేర్కొంది.

Tatkaal పాస్‌పోర్ట్‌కు అదనపు చార్జీలు

Tatkaal పాస్‌పోర్ట్ కోసం సాధారణ పాస్‌పోర్ట్ ఫీజుతో పాటు Tatkaal ఛార్జీ కూడా వర్తిస్తుంది. Tatkaal కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత అర్హత నిబంధనలు, అవసరమైన అదనపు పత్రాలను పరిశీలించాలని Passport Seva సూచిస్తోంది.

అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేయండి

పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నకిలీ వెబ్‌సైట్లు, అనధికారిక ఏజెంట్లను నమ్మవద్దని Passport Seva హెచ్చరిస్తోంది. పాస్‌పోర్ట్ సేవలకు అధికారిక పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.