PAN Card New Rules: డబ్బు ఉన్నా పని జరగదు.. మీ జేబులో పాన్ కార్డ్ లేకపోతే కష్టమే! ఈ షాకింగ్ రూల్స్ తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card New Rules: పాన్ కార్డును కేవలం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. అయితే అలా అనుకునే వారు వెంటనే మీ పాన్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. ఇప్పుడు పాన్ కార్డ్ అనేది కేవలం ఒక ప్లాస్టిక్ కార్డు మాత్రమే కాదు, అది మీ ఆర్థిక గుర్తింపునకు అత్యంత శక్తివంతమైన గుర్తింపు మారింది.
READ ALSO: Akshaya Tritiya: నేడు అక్షయ తృతీయ.. బంగారం లేకున్నా పరవాలేదు.. ఈ పనులు చేస్తే చాలు!
Also Read
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
- RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
- Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
ఈ పనులకు పాన్ కార్డు లేకపోతే బ్రేక్ పడినట్లే
ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. నిర్దిష్ట పరిమితి మించిన ప్రతి లావాదేవీకి పాన్ సమాచారం తప్పనిసరి. ద్విచక్ర వాహనాలు మినహా, మీరు ఏదైనా కారు లేదా వాణిజ్య వాహనాన్ని కొనుగోలు చేసినా లేదా విక్రయించినా పాన్ కార్డ్ ఉండాల్సిందే. పొదుపు ఖాతా మినహా కొత్త బ్యాంకు ఖాతా తెరవాలన్నా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా కావాలన్నా పాన్ కచ్చితంగా కావాలి. హోటల్ లేదా రెస్టారెంట్‌లో రూ.50,000 కంటే ఎక్కువ నగదు బిల్లు చెల్లిస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణం కోసం రూ.50,000 మించిన విదేశీ కరెన్సీ కొనుగోలుకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
పెట్టుబడులపై కఠిన నిబంధనలు
కేవలం ఖర్చులకే కాదు, పొదుపు విషయంలోనూ పాన్ కార్డు విషయం నిబంధనలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్‌లు, డిబెంచర్లు లేదా ఆర్‌బిఐ బాండ్లలో రూ.50,000 మించిన పెట్టుబడులకు పాన్ తప్పనిసరిగా మారింది. అలాగే బ్యాంకులో ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు జమ చేసినా, డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకున్నా పాన్ అవసరం. వార్షిక జీవిత బీమా ప్రీమియం రూ.50,000 దాటినా లేదా డిజిటల్ వాలెట్‌లో ఏడాదికి రూ.50,000 కంటే ఎక్కువ ఖర్చు చేసినా పాన్ నంబర్ ఇవ్వాలి. రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన భూమి లేదా ఇల్లు కొనుగోలు/విక్రయాలకు, అలాగే రూ.1లక్ష మించిన అన్‌లిస్టెడ్ షేర్ల లావాదేవీలకు పాన్ ఉండటం ముందస్తు అవసరం.
చాలామందికి సరైన సమాచారం లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసి, ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంటున్నారు. పాన్ కార్డ్ మీ ప్రతి ఆర్థిక కదలికను నమోదు చేస్తుంది, ఇది ప్రభుత్వం మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఏదైనా పెద్ద లావాదేవీ చేసే ముందు కచ్చితంగా మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే, మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం మర్చిపోవద్దు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే మీ కష్టార్జితంతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త.
READ ALSO: Who Rules Iran: ఇరాన్‌లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
తాజావార్తలు
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!