పాన్ కార్డు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఒకటి.. ఆధార్ కార్డ్ ఎంత అత్యవసరంగా మారిందో పాన్ కార్డు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రతీ ఒక్కరూ పాన్ కార్డును తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పాన్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. బైక్ మొదలు భూ కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డులను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో పాన్ కార్డ్ విషయాల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుంటాయి..
అందులో మహిళలు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరు మార్చుకోవడం మామూలే..దీనికోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు.. మీ ఇంట్లో కూర్చొనే మీ పేరును మార్చుకోవచ్చు.. ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవడం కోసం ముందుగా మొబైల్ లేదా కంప్యూటర్‌లో టీఐఎన్ ఎన్‌ఎస్‌డీఎల్ (www.tin-nsdl.com) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం సర్వీస్ విభాగంలోని పాన్ ను క్లిక్ చెయ్యాలి.. ఆ తర్వాత కరెక్షన్స్ ను ఎంపిక చేసుకోవాలి.. అప్లికేషన్ టైప్’ ఆప్షన్‌లో.. ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం పాన్ నంబర్ అలాగే పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.. అన్ని కరెక్ట్ గా అప్లై చేసి చివరగా సబ్మిట్ చెయ్యాలి..
పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చెయ్యాలి.. పేమెంట్ పూర్తికాగానే.. మీరు పాన్ కార్డును అప్‌డేట్ చేసినట్టుగా ఓ ఫారమ్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి… ఇక ఆ ఫామ్‌పై రెండు ఫొటోలు అతికించి దానిపై సంతకం చేయాలి. అలాగే పేరు మార్చిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్‌ను యాడ్ చేయాలి. ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా పాన్ కార్డ్‌లో మార్పులు చేస్తే, దరఖాస్తును ఎన్‌ఎస్‌డీఎల్‌కి పోస్ట్ చేయాలి..అప్లికేషన్‌ను UTIITSLకి పోస్ట్ చేయాలి.. మీ పేరును ఇలా మార్చుకోవచ్చు..
