Site icon NTV Telugu

OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరు ఏంటో తెలుసా..?

Oyo

Oyo

OYO: ఓయో కంపెనీ పేరు మారింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. అయితే ఒక బ్రాండ్‌గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఐపీఓ ముంగిట ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని బోర్డు ఛైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ పేరు కంపెనీ నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రిజం విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, కంపెనీ వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

READ ALSO: Telangana BJP: బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్ఠానం.. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు!

పోర్ట్ ఫోలియో చూశారా…
వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను ఓయో నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్‌లు, సెలబ్రేషన్ స్పేస్‌లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.

రితేష్ అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను కలిగి ఉంది. ఓయో మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6 వేలకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది.

READ ALSO: Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్.. పొరుగు దేశానికి ఏమైంది..!

Exit mobile version