OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరు ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OYO: ఓయో కంపెనీ పేరు మారింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. అయితే ఒక బ్రాండ్‌గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఐపీఓ ముంగిట ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని బోర్డు ఛైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ పేరు కంపెనీ నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రిజం విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, కంపెనీ వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
READ ALSO: Telangana BJP: బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్ఠానం.. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు!
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
పోర్ట్ ఫోలియో చూశారా…
వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను ఓయో నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్‌లు, సెలబ్రేషన్ స్పేస్‌లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.
రితేష్ అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను కలిగి ఉంది. ఓయో మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6 వేలకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది.
READ ALSO: Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్.. పొరుగు దేశానికి ఏమైంది..!
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!