Site icon NTV Telugu

అర్ధరాత్రి నుంచి మనీ ట్రాన్సాక్షన్ బంద్

ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగపడే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT)ను ఆధునికీకరించబోతున్నారు. ఈ టెక్నికల్ అప్‌గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు NEFT సేవలు నిలిచిపోబోతున్నాయి. మే 22 రాత్రి 00:01 గంటల నుంచి మే 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ వివరాలతో ఓ నోటిఫికేషన్‌ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జారీ చేసింది. 

NEFT సేవలను వినియోగించుకునే బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ వివరాలను తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఓ ప్రణాళికను రూపొందించుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించాలని పేర్కొంది. NEFT మెంబర్ బ్యాంకులకు NEFT సిస్టమ్ బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయనున్నట్లు వివరించింది. ….రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సదుపాయం ఈ సమయంలో యథావిథిగానే కొనసాగుతుందని ఆర్బీఐ పేర్కొంది. దీనిని ఏప్రిల్ 18న అప్‌గ్రేడ్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. 

Exit mobile version