ONDC Network: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ‘‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’’లోకి షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ Shiprocket చేరింది. తద్వారా ఈ పరిధిలోకి వచ్చిన తొలి ఇంటర్-సిటీ లాజిస్టిక్స్ ప్రొవైడర్ గా నిలిచింది. ఈ మేరకు ఈ నెల 22న తొలి లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇకపై అన్ని సెగ్మెంట్లకు సంబంధించిన విక్రయదారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న సిటీలకు, టౌన్లకు చేరవేసే వీలు కలిగింది.
read also: Rahul Gandhi: దేశమంతా రైతు రుణమాఫీ, ఒకటే జీఎస్టీ
మన దేశంలో డిజిటలైజేషన్ పెరగటంతో టయర్-2, టయర్-3 సిటీల్లో విక్రయదారులు పెరుగుతున్నారు. వాళ్లకు లాజిస్టిక్స్ సపోర్ట్ ఎంతైనా అవసరం. అందుకే తాము వాళ్ల వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇంక్లూజివ్ అండ్ ఓపెన్ యాక్సెస్ టెక్ ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తున్నామని షిప్‌రాకెట్ కో-ఫౌండర్ సాహిల్ గోయెల్ చెప్పారు. ఈ సంస్థ లక్ష మందికి పైగా కస్టమర్లకు తమ సేవలందిస్తోంది. ఆ వినియోగదారులు దేశంలోని 24 వేల పిన్‌కోడ్ పరిధిలోని ప్రాంతాల నుంచి డెలివరీ పార్ట్నర్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు.
ప్రొడక్టులను క్యాష్-ఆన్-డెలివరీ మరియు ప్రిపెయిడ్ ఆప్షన్ల ద్వారా పేమెంట్ చేసి షిప్‌మెంట్లను పొందొచ్చు. దేశంలోని ప్రతి ఇండిపెండెంట్ రిటైలర్‌ను చేరుకోవాలని షిప్‌రాకెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా రిటైలర్ల డెలివరీ మరియు కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరచాలని భావిస్తోంది. తద్వారా పెద్ద పెద్ద డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో పోటీపడి ముందుకు వెళ్లాలనే పట్టుదలతో ఉంది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో గోడౌన్ల సామర్థ్యంతో బుకింగ్‌లను అదే రోజు లేదా తర్వాతి రోజు డెలివరీ చేసేలా ప్రయత్నిస్తోంది.
