Ola S1 Air: ఓలా మరో సంచలనం.. బడ్జెట్ ధరలోనే కొత్త మోడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Launched Budget Oriented S1 Air Electric Scooter: ఎలక్ట్రిక్ బైక్ రంగంలో సరికొత్త సంచలనాలతో ఆశ్చర్యానికి గురి చేస్తోన్న ఓలా సంస్థ.. ఇప్పుడు లేటెస్ట్గా మరో బాంబ్ పేల్చింది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు.. ఈసారి అత్యంత చౌక ధరకే ఒక కొత్త మోడల్ని రిలీజ్ చేసింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఓలా ఎస్1 ఎయిర్ పేరుతో కొత్త మోడల్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఓలా సంస్థ ఎస్1, ఎస్1ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. తొలుత ఎస్1 ప్రో మోడల్ని విక్రయానికి తీసుకురాగా.. మొదట్లో అవి బాగానే అమ్ముడుపోయాయి. రానురాను విక్రయాలు తగ్గిపోవడంతో.. ఎస్1 స్కూటర్ని రూ. 99 వేల ధరకు మార్కెట్లోకి తెచ్చింది. ధర తగ్గించడం వల్ల విక్రయాలు పెరుగుతాయని ఆ సంస్థ భావించింది. కానీ, అది ఆ అంచనాల్ని అందుకోలేదు.
ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ధరలో తాజాగా ‘ఎస్1 ఎయిర్’ మోడల్ని ఓలా సంస్థ రంగంలోకి దింపింది. డిజైన్ పరంగా.. గత ఎస్1, ఎస్1 ప్రోతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. చూడ్డానికి ఆ పాత మోడళ్లనే ఇది పోలి ఉంది. సాఫ్ట్వేర్ కూడా ఒక్కటే. బ్యాటరీ కెపాసిటీలో మాత్రం మార్పులున్నాయి. బ్యాటరీ 2.5 కిలోవాట్ హవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మోటార్ 4.5 కిలోవాట్ పవర్‌తో వస్తుంది. ఒక్కసారి చార్జ్‌తో 101 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ కొత్త మోడల్ వెళ్తుందని ఓలా ప్రకటించింది. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. 7 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 2.2 గిగాహెర్జ్ 8 కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, మ్యూజిక్ ప్లేబ్యాక్, నేవిగేషన్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అంటూ మూడు మోడ్లు ఉంటాయి. దీని వెనుక వెనుక బాడీ కలర్లో డ్యుయల్ టోన్‌తో స్వల్ప మార్పు చేశారు.
Also Read
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
సున్నా నుంచి 100 శాతం చార్జింగ్ అవ్వడానికి.. ఈ ఓలా ఎస్1 ఎయిస్ సుమారు 4.5 గంటల సమయం తీసుకుంటుందని ఓలా సంస్థ తెలిపింది. రూ.999 చెల్లించి.. కస్టమర్లు ఈ కొత్త స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ కొత్త మోడళ్ల కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ నుంచి డెలివరీ చేస్తారు. తొలుత దీని ధరను రూ. 79,999గా కేటాయించిన ఓలా సంస్థ.. ఆ తర్వాత రూ.85 వేలకు పెంచనుంది. మరి, ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఎలాంటి విప్లవాలు తీసుకొస్తుందో చూడాలి. పెట్రోల్ స్కూటర్ యాక్టివాకు గట్టిపోటీ ఇవ్వడమే తమ ఉద్దేశ్యమని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. మరి, దానికి ఇది పోటీ ఇవ్వగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!