Site icon NTV Telugu

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌…

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కు డిమాండ్ పెరుగుతున్న‌ది.  ముందుగా రూ.499 తో బుకింగ్ చేసుకోవాలి. 75 వ భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుద‌ల చేయ‌నున్నారు.  ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లో  రివ‌ర్స్ మోడ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.  ఇది చాలా త‌క్కువ ద్విచక్ర‌వాహ‌నాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ది.  హోండా గోల్డ్ వింగ్‌, బ‌జాజ్ చేత‌క్‌, ఏథ‌ర్ 450, టీవీఎస్ ఐ క్యూబ్ వంటి వాహ‌నాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ది.  ఇప్పుడు రివ‌ర్స్ మోడ్‌ను ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది.  75 వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ ఎల‌క్ట్రిక్ వాహ‌నం ఓలాకు సంబందించి పూర్తి ఫీచ‌ర్ల‌ను వెలువ‌రిస్తామ‌ని ఓలా ప్ర‌క‌టించింది. 

Read: చిరు మూవీ విషయంలో మాట నెగ్గించుకున్న కీర్తి సురేశ్!

Exit mobile version